![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -11 లో.. రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇంటికి వచ్చాక ఇద్దరు ఒకరినొకరు ఎక్కడో చూసానా అని ఆలోచిస్తుంటారు. ఎస్ ఆ రోజు నాపై కలర్స్ పోసింది ఆ అమ్మాయే కదా అని సీతాకాంత్ గుర్తుకుచేసుకుంటాడు.. అదే సమయంలో రామలక్ష్మి కూడా నేను పొరపాటున ఆ రోజు అతనిపై కలర్ చల్లాను కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఇన్ని రోజులకి కన్పించావా రౌడీ బేబీ అని సీతాకాంత్ అనుకుంటాడు.
మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ హడావిడిగా రామలక్ష్మి కలర్స్ చల్లిన కార్ ని తీసుకొని బయల్దేరి ఒక చోటుకి వచ్చి తన పిఏ కీ కాల్ చేసి ఆ అమ్మాయి అడ్రస్ తెలిసిందా అని కనుక్కుంటాడు. తెలిసింది ఆ అమ్మాయి క్యాబ్ డ్రైవర్ అని అంటాడు. క్యాబ్ ఓనర్ నెంబర్ మీకు పంపిస్తానని పిఏ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ క్యాబ్ ఓనర్ కి కాల్ చేసి.. నీ వెహికల్స్ అన్ని ఇక్కడ ఉండాలని చెప్పడంతో.. అతను సరే అని అన్ని క్యాబ్ డ్రైవర్స్ ని సీతాకాంత్ ఉన్నా చోటుకి రమ్మని చెప్తాడు. అలాగే రామలక్ష్మికి కూడా చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వస్తుంది. సర్ కి సారి అంట చెప్పమని క్యాబ్ ఓనర్ రామలక్ష్మితో చెప్తాడు. నేను ఎందుకు చెప్పాలంటూ రామలక్ష్మి పొగరుగా మాట్లాడుతుంది. నీ పేరేంటని రామలక్ష్మిని సీతాకాంత్ అడుగుతాడు. ముందు మీ పేరు చెప్పడం మర్యాదంటు సీతాకాంత్ తో తగ్గకుండా మాట్లాడుతుంది రామలక్ష్మి. నా కార్ పై ఆ రోజు కలర్ చల్లావ్.. ఇప్పుడు క్లీన్ చెయ్ అని సీతాకాంత్ చెప్తాడు. ఆ రోజు నుండి ఇలాగే ఉంచారా అని రామలక్ష్మి ఆశ్చర్యపోతుంది.
ఆ తర్వాత నువ్వే చల్లావ్ కాబట్టి నువ్వే క్లీన్ చెయ్యాలని సీతాకాంత్ చెప్తాడు. దానిదేం ఉంది క్లీన్ చేస్తాను అంటు కార్ క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత వెళ్లిపోతు నేను కార్ పై మాత్రమే కలర్ చల్లలేదు.. మీపై కూడా చల్లాను రూల్ పాటించారా.. మరి మీ మొహాన్ని ఎందుకు మీరే క్లీన్ చేసుకున్నారంటూ సీతాకాంత్ మొహంపై వాటర్ కొట్టి వెళ్ళిపోతుంది. మరోవైపు సీతాకాంత్ వాళ్ళింట్లో మరో డిస్కషన్ సాగుతుంది. వాళ్ళ ఇంట్లో పనిచేసే పనిమనిషి మొదలెడుతుంది. మీకేం తక్కవ, పెద్ద సర్ తో పాటు మీ సర్ కి కూడా వాటా ఉంది కదా.. మీరెందుకు బిజినెస్ చేసుకోండి అంటు శ్రీవల్లితో పనిమనిషి అనగానే శ్రీవల్లి ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |